నవతెలంగాణ- హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్ కింద, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్-రిజిస్టర్డ్, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాన్ని భారత గగనతలంలోకి అనుమతించరు. ఈ నిర్ణయం పాక్ ఎయిర్‌లైన్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్ విమానాలు సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. దీంతో దాయాది ఎయిర్ సర్వీసుపై పెను ప్రభావం పడనుంది.
పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం
- Advertisement -