Wednesday, May 7, 2025
Homeజాతీయంపాక్ సైన్యం కాల్పులు..ముగ్గురు పౌరులు మృతి

పాక్ సైన్యం కాల్పులు..ముగ్గురు పౌరులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దులో నక్కి ఉన్న ఉగ్రవాదులు భారత సైన్యం ఏరివేస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను సైతం ధ్వంసం చేస్తోంది. అయితే అటు పాకిస్థాన్ సైతం కాల్పులు జరుపుతోంది. ఎల్వోసీ పరిసరాల ప్రాంతాలనైనా పూంజ్, రాజౌరిలో మోర్టార్ ఆయుధాలతో బాంబు దాడికి దిగింది. పూంచ్ లోని కృష్ణఘాటి, షాపూర్, మంకోట్, రాజౌరి జిల్లాలోని లామ్, మంజోకోట్, గంబీర్ బ్రహ్మాణ ప్రాంతాల్లో బాంబు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు అమరులయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను వదలొద్దని, పాక్ సైన్యం కాల్పులను విరమించుకోవాలని ఆయా ప్రాంతా వాసులు అంటున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భారత్ సైన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ సైన్యం కాల్పుల్లో ఇప్పటివరకూ 30 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. దీంతో భారత సరిహద్దు ఎల్వోసీలో భీకరమైన వాతావరణ కనిపిస్తోందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -