Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుపాడుతా తీయగా షో జడ్జెస్‌పై సింగర్‌ ప్రవస్తి సంచ‌ల‌న‌ ఆరోపణలు

పాడుతా తీయగా షో జడ్జెస్‌పై సింగర్‌ ప్రవస్తి సంచ‌ల‌న‌ ఆరోపణలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన ‘పాడుతా తీయగా’ షో ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో అప్రతిహతంగా సాగుతూ వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం మరణించిన తర్వాత ఈ షో ని ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్‌ హోస్ట్‌ చేస్తున్నారు. ఈ షోకి సునీత, చంద్రబోస్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సిల్వర్‌ జూబ్లి సిరీస్‌కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఈ షో పై సింగర్‌ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పట్నుంచే తన అద్భుతమైన గానంతో మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి. బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌ పలు సందర్భాలలో ఆమె టాలెంట్‌ని ప్రశంసించారు. అయితే ఇటీవలే షో నుండి ప్రవస్తి ఎలిమినేట్‌ అయింది. ఎంతో గొప్ప సింగరయిన ప్రవస్తి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్‌ అవడం ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇక తన ఎలిమినేషన్‌పై ప్రవస్తి రియాక్ట్‌ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కి వెళ్లాలనుకుంటున్న సింగర్స్‌కి నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్‌ లేదా జడ్జీల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే షో కి వెళ్లండి.. లేదంటే మీకు అన్యాయం, మానసిక వేదన మిగులుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రవస్తి పోస్ట్‌లపై ఆమెని కొందరు పర్సనల్‌గా ఎటాక్‌ చేస్తున్నారు. దానిపై ప్రవస్తి స్పందిస్తూ.. దమ్ముంటే నీ ఒరిజినల్‌ అకౌంట్‌ నుంచి మెసేజ్‌ చెయి.. ఇలా ఫేక్‌ అకౌంట్‌ నుంచి కాదు అంటూ స్ట్రాంగ్‌ రిప్లరు ఇచ్చింది. ఆ తర్వాత ” నేను ఈ షో గురించి మాట్లాడగానే నా తోటి ఎక్స్‌ కంటెస్టెంట్లు ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి నన్ను తిడుతున్నారు.. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు.. నేను ఎక్కడ వాళ్ల గొంతు గుర్తుపడతానేమోనని భయపడుతున్నారు.. అయినా ఈ కామెంట్‌ చేసిందెవరో నాకు తెలుసు ” అంటూ ప్రవస్తి మరో పోస్ట్‌ పెట్టింది. షో లో జడ్జిలు నన్ను చీడపురుగులా చూసేవాళ్ళు అని పేర్కొంది. నా బాడీ మీద కూడా వారు జోక్స్‌ వేశారు. తమిళంలో కూడా చాలా షోలు చేశాను కానీ ఎక్కడా ఇలా చూడలేదు. ప్రొడక్షన్‌ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్లు, ఎక్స్‌ పోజింగ్‌ చేయమనేవాళ్లు, చీరలు ఇచ్చి బడ్డు కిందకు కట్టుకోమనేవారు. అలా ఇబ్బంది పడుతూనే పాటలు పాడాను. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ బాడీ షేమింగ్‌ చేశాడు. ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అని అనేవారు. 2017 వరకు కూడా ఇలా లేదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వచ్చారో అప్పట్నుంచే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశస్తి ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img