Wednesday, April 30, 2025
Homeజాతీయంపాతికేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయంటే?!

పాతికేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయంటే?!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మంగళవారం (ఏప్రిల్‌ 22) జమ్మూకాశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంకు సమీపంలోని బైసరన్‌ వ్యాలీ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గత పాతికేళ్లలో ఉగ్రవాదులు పదకొండుసార్లు జమ్మూకాశ్మీర్‌లో దాడులకు తెగబడ్డారు.

మార్చి 21- 2000 : ఉగ్రవాదులు సిక్కు కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అనంతనాగ్‌ జిల్లా, చట్టిసింగ్‌పోరా గ్రామంలో రాత్రిపూట కాల్పులకు పాల్పడ్డారు. మార్చి 21వ తేదీన జరిగిన ఈ దాడిలో 36 మంది మృతి చెందారు.

ఆగస్టు – 2000
నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ దాడిలో రెండు డజన్లకు పైగా అమర్‌నాథ్‌ యాత్రికులతో సహా 32 మంది మృతి చెందారు.

జూలై – 2001
అమరనాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని.. తీవ్రవాదులు శేషనాగ్‌ క్యాంప్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది మృతి చెందారు.

అక్టోబర్‌ 1 – 2001
జమ్మూకాశ్మీర్‌ శ్రీనగర్‌ శాసనసభ కాంప్లెక్స్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 36 మంది మృతి చెందారు.

2002
చందన్‌వారి క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిలో 11 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి చెందారు.

నవంబర్‌ 23, 2002
జమ్మూకాశ్మీర్‌ ముండా సమీపంలో జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పేలుడు సంభవించడం వల్ల 19 మంది మృతి చెందారు. వీరిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు చనిపోయారు.

మార్చి 23 – 2003
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నందిమార్గ్‌ గ్రామంలో పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా 24 మంది పండిట్లు ప్రాణాలు కోల్పోయరు.

జూన్‌ 13 – 2005
పుల్వామాలోని ప్రభుత్వ పాఠశాల ముందు రద్దీగా ఉండే మార్కెట్‌లో పేలుడు పదార్థాలతో ఉన్న కారు బ్లాస్ట్‌ అయింది. ఈ ప్రమాదంలో వందలాది ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. 13 మంది పౌరులు, ఇద్దరు స్కూలు చిన్నారులు, ముగ్గురు సిఆర్‌పిఎఫ్‌ అధికారులు మృతి చెందారు.

జూన్‌ 12 – 2006
జూన్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వల్ల నేపాల్‌, బీహార్‌కు చెందిన కార్మికులు తొమ్మిది మంది మృతి చెందారు.

జూలై 10 : 2017
కుల్గామ్‌లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు.

ఏప్రిల్‌ 22 – 2025
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వల్ల 26 మంది మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img