Monday, May 19, 2025
Homeజాతీయంపార్టీల‌కు కాదు..దేశం త‌రుపున ప్రాతినిధ్యం: కిరణ్ రిజిజు

పార్టీల‌కు కాదు..దేశం త‌రుపున ప్రాతినిధ్యం: కిరణ్ రిజిజు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాక్ పై దౌత్య యుద్ధానికి, ఆదేశ‌ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేయ‌డానికి ఏడుగురు ఎంపీల‌తో కూడిన‌ ప్ర‌తినాయక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఆయా MPల ఎంపిక‌పై కాంగ్రెస్ తోపాటు ప‌లు పార్టీలు మోడీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ వెల్ల‌డించిన ఎంపీల‌ను కాద‌ని శ‌శిథ‌రూర్ ను ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ అంశంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీ మీడియా స‌మావేశంలో స్పందించారు. ఆల్ పార్టీ ఎంపీల బృందం పార్టీల‌కు నాయ‌కత్వం వ‌హించ‌డంలేద‌ని, దేశం త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాయని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శాంతి స్థాప‌న‌కు ఇండియా చేస్తున్న కృషి ప్ర‌పంచ‌దేశాల‌కు తెలియాలని, ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న పాక్ చ‌ర్య‌ల‌ను యావ‌త్తు దేశాల‌కు తెలిజేయాల‌ని కేంద్రం ఆల్ పార్టీ ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింద‌ని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు అన్నారు. ఏప్రీల్ 22న ప‌హ‌ల్గాంలో 26మంది అమాయ‌క ప‌ర్యాట‌కుల‌ను..పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు బ‌లితీసుకున్నార‌ని ఢిల్లీ మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -