– బెంగాల్, త్రిపురలో పుంజుకుంటాం
– ఫాసిస్టు శక్తులతో పోరాడాలంటే వామపక్షాలు బలోపేతం కావాలి
– అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపడతాం: సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కోల్‌కతా: తమ పార్టీ స్వతంత్రంగా బలం పుంజుకోవడంలోనూ, అలాగే దేశంలో వామపక్షాలు బలోపేతం కావడంలోనూ పశ్చిమ బెంగాల్ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ చెప్పారు. వామపక్షాలకు, లౌకిక శక్తులకు బెంగాల్ ఆధునిక స్థావరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని వివిధ పార్టీలు చేరువ అయ్యాయని, వాటిపై ఓ పథకం ప్రకారం దాడి జరుగుతోందని అన్నారు. బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో సీపీఐ (ఎం), వామపక్షాల ఎన్నికల పనితీరులో కొంత తగ్గుదల కన్పిస్తోందని అంగీక రిస్తూ దేశంలోని నయా ఫాసిస్టు శక్తులతో పోరా డాలంటే పార్టీతో పాటు వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. బేబి మంగళవారం సీపీఐ (ఎం) కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ, సంస్థాగత లక్ష్యాలను పార్టీ రాష్ట్ర సమావేశాలలో నిర్దేశించు కుంటున్నామని చెప్పారు. ఈ లక్ష్యాల కారణంగా పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ప్రాభవాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకో వడంలో కేంద్ర కమిటీ సాయపడుతుందని తెలిపారు. వామపక్షాల ప్రభావం పెరగడం చాలా ముఖ్యమని అంటూ అది ఏ విధంగా ఇనుమడించి ఎన్నికల పోరాటాలలో ప్రతిబింబిస్తుందో చూడాల్సి ఉందని అన్నారు. సీపీఐ (ఎం) తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అవసరమైన పక్షంలో దిద్దుబాటు చేసుకుంటామని చెప్పారు.
‘మా ప్రతికూలురులను వినడానికి సైతం మేము సిద్ధమే. వాళ్లు చెప్పే దానిలో ఏదైనా విషయం ఉంటే మేము దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం’ అని బేబి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ (ఎం), వామపక్షాలు సరైన దారిలోనే వెళుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకల కారణంగా 26 వేల మంది పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో విధి నిర్వహ ణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మతతత్వ శక్తులు కూడా క్రియాశీలకంగా వ్యవహరి స్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సీపీఐ (ఎం) ప్రజా సంఘాలు మెగా ర్యాలీని నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎర్ర జెండాలు చేబూనిన అశేష జనవాహినితో మైదానం నిండిపోయిందని చెప్పారు.
గ్రామీణ, పట్టణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని మదురైలో జరిగిన 24వ పార్టీ మహాసభలు కమ్యూనిస్టు సంఘాలకు, రైతు-కార్మిక సంఘాలకు పిలుపునిచ్చిందని బేబి తెలిపారు. ‘పార్టీ మహాసభలు ముగిసిన వెంటనే బెంగాల్‌లో జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని గమనిస్తే సీపీఐ (ఎం) ఇచ్చిన పిలుపును చిత్తశుద్ధితో, విజయవంతంగా ఏ విధంగా అమలు చేసారో అర్థమవుతుంది’ అని అన్నారు. వక్ఫ్ సవ రణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శిం చారు. మత, భాషారమైన మైనారిటీలకు రాజ్యాం గం రక్షణ కల్పిస్తోందని బేబి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న సీపీఐ (ఎం) రాష్ట్ర సమా వేశంలో పాల్గొనేందుకు బేబి కోల్‌కతా వచ్చారు.
పూర్వ వైభవం సాధిస్తాం
- Advertisement -