నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రక్రియకు భారత్‌కు పాకిస్తాన్ పూర్తిగా సహకరించాలని ఆయన సూచించారు. తాజాగా ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. జెడివాన్స్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే పెహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి 26 మంది మృతి చెందారు. ఈ విషయంపైనే ఫాక్స్ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి ‘భారత్, పాక్‌ల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై ఆయన స్పందించారు. ‘ముఖ్యంగా రెండు అణ్వాయుధ శక్తుల మధ్య ఇలాంటి సంఘటన జరగడం ఆందోళన కలిగించే విషయం. మేము మా స్నేహితులు భారత్, పాకిస్తాన్‌లతో సన్నిహిత సంబంధాలనే కలిగి ఉన్నాము. ఈ ఉగ్రదాడి ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా భారత్ ప్రతిస్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. పాకిస్తాన్ వారు ఈ ఉగ్రదాడికి బాధ్యత వహిచేంత వరకు భారత్ భూభాగంలో జరుగుతున్న ఉగ్రదాల వేటాడే ప్రక్రియకు భారత్‌కు సహకరించాలి’ అని ఆయన అన్నారు.
పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి: జెడివాన్స్
- Advertisement -
RELATED ARTICLES