Tuesday, April 29, 2025
Homeరాష్ట్రీయంపేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి

– మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– హయత్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిశీలన
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని తెలంగాణ పౌరస్పందన వేదిక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ”ప్రభుత్వ బడులు నిలబడాలి.. చదువుల్లో అంతరాలు పోవాలి” అనే నినాదంతో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులను సంద ఓర్శించేలా ప్రచార జాతను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వం పేదలకు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తే పేదల బతుకులు మారడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలన్నింటిలో ప్రీ ప్రైమరీ తరగతులను జూన్‌లోగా ప్రారంభించాలని కోరారు. గ్రేటర్‌ పరిధిలో కొత్తగా ఏర్పడిన నివాస ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వ బడులను పెట్టాలని, మధ్యాహ్న భోజనాన్ని ఆయా బడుల్లోనే ఏజెన్సీల ద్వారా వంట చేయించి పెట్టాలన్నారు. విద్యా పాలన వ్యవస్థలో బడుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల నిధులకు రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి, కావ్య, మంగ, ధనమూర్తి, గుండె శివకుమార్‌, ప్రణరు, వంశీ, నవీన్‌, పాష, చంటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img