– కపిల, తనీశ జోడీ ఓటమి
– ఆసియా చాంపియన్‌షిప్స్
నింగ్‌బో (చైనా) : 2025 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఇండియా పోరాటానికి తెర పడింది. సింగిల్స్ విభాగాల్లో అగ్రశ్రేణి షట్లర్లు ఇదివరకే ఇంటిముఖం పట్టగా.. తాజాగా డబుల్స్ విభాగంలోనూ పతక వేటలో ఆశలు ఆవిరయ్యాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టో జోడీ వరుస గేముల్లో పరాజయం పాలైంది. ఐదో సీడ్ చైనా షట్లర్లు చున్ మన్, యింగ్ సుయెట్‌లు 22-20, 21-13తో 41 నిమిషాల్లోనే వరల్డ్ నం.18 భారత జోడీపై విజయం సాధించారు. తొలి గేమ్‌లో 8-0తో తిరుగులేని ముందంజ వేసిన కపిల, తనీశ జోడీ.. ఆధిక్యం నిలుపుకోలేదు. 10-10తో స్కోరు సమం చేసిన చైనా షట్లర్లు ద్వితీయార్థంలో 19-19తో గట్టి పోటీ ఇచ్చారు. టైబ్రేకర్‌లో తొలి గేమ్ సాధించిన చైనా జోడీ.. రెండో గేమ్‌ను అలవోకగా ఖాతాలో వేసుకున్నారు. 9-9 వరకు రెండో గేమ్ పోటీలో నిలిచిన తనీశ, కపిల జంట ఆ తర్వాత లయ తప్పింది. తనీశ క్రాస్టో, ధ్రువ్ కపిల ఓటమితో ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం ముగిసింది.
పోరాటం ముగిసింది
- Advertisement -