Saturday, August 16, 2025
E-PAPER
spot_img
HomeNewsప్రజల చెంతే..సమస్యలకు సత్వర పరిష్కారం..

ప్రజల చెంతే..సమస్యలకు సత్వర పరిష్కారం..

- Advertisement -
  • ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి శ్రీకారం
  • నేడు వాహనాన్ని లాంచనంగా ప్రారంభించనున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరగకుండా అధికారుల బృందం వాహనంలో వచ్చి ప్రజల చెంతనే ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కారించేల మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లాంచనంగా ప్రారంభించనున్నారు. 

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంలో..

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనంలో అధునాతన సౌకర్యాలు కల్పించారు.కంప్యూటర్,ప్రింటర్,స్టేషనరీ, సౌండ్ సిస్టమ్ తో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఫిర్యాదులు నమోదు చేయడానికి సిబ్బందిని అందుబాటులో ఉంటారు.నమోదైన ఫిర్యాదులు పరిష్కారమైనా, కాకపోయినా వాటి స్టేటస్ తెలుసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించారు.వాహనంలో ఎమ్మెల్యే,అధికారుల బృందంతో వారంలో మూడు రోజులపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తారు. 

ప్రత్యేక యాప్ లో ఫిర్యాదుల నమోదు..

ప్రజలు తమ సమస్యలు,విన్నపాలను నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరిట ప్రత్యేకమైన యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.మానకొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2.28 లక్షల మంది ఓటర్ల ఐడీకి అనుసంధానం చేశారు.ఓటర్లు తమ సమస్యలను నేరుగా ఈ యాప్ లో నమోదు చేసుకుంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారు.

సమస్యల పరిష్కారానికే..

ప్రజల చెంతకే వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఆన్ వీల్ ప్రారంభిస్తున్నాం.సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి క్యాంపు కార్యాలయానికి రావడం వంటి ఇక్కట్లకు గురవ్వకూడదనే సంకల్పంతో ఎమ్మెల్యే ఆన్ వీల్ కార్యక్రమానికి రూపకల్పన చేశాను. మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, పోలీస్, వైద్య, విద్య, విద్యుత్, తదితర శాఖల అధికారులతో జరిపే ఈ కార్యక్రమం ద్వారా చాలా వరకు ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావముంది. మంచి ఉద్దేశంతో చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, అధికారులు భాగస్వాములవ్వాలి.

  • కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ఆన్ వీల్స్ బృహత్తర కార్యక్రమం..

ప్రజలు సమస్యల పరిష్కానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరిటా కార్యక్రమం చేపట్టం హర్షనీయం.అక్కడిక్కడే ప్రజా సమస్యలను సత్వరౌ పరిష్కరించడం బృహత్తర కార్యక్రమం.ప్రజలు తమ సమస్యలను నేరుగా పిర్యాదు చేసేల ప్రత్యేక యాప్ రుపోందించడం శుభపరిణామం.


-ముక్కీస రత్నాకర్ రెడ్డి,మండలాధ్యక్షుడు బెజ్జంకి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad