Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  పిలుపునిచ్చారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు చెక్ పెట్టండి – పర్యావరణాన్ని కాపాడండి అనే గోడ పత్రికను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం” అనే నినాదం చేపట్టారని  తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణం) ఆధ్వర్యంలో ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వచ్చే అనారోగ్య సమస్యపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహన  కార్యక్రమాలు  నిర్వహించాలని తెలిపారు. పర్యావరణ ప్రాధాన్యత, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే అంశాలపై మరింత ఫోకస్ చేయాలన్నారు.  ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టం గురించి వివరించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఆర్డీఓ బాలకృష్ణ, డిపిఓ వీరభద్రయ్య,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, పౌర సరఫరాల అధికారి శ్రీనాద్, కెటిపిపి ఎస్ ఈ రామ ముత్యాలరావు, ఎస్బిఎం కన్సల్టెంట్స్ భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad