Tuesday, April 29, 2025
Homeజాతీయంప్ర‌త్యేక పార్ల‌మెంట్‌ స‌మావేశాలు నిర్వ‌హించండి: రాహుల్‌

ప్ర‌త్యేక పార్ల‌మెంట్‌ స‌మావేశాలు నిర్వ‌హించండి: రాహుల్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ .. ప్ర‌ధాని మోదీని కోరారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిపై చ‌ర్చించేందుకు అత్య‌వ‌స‌రంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కోరారు. ఉగ్ర‌వాదాన్ని ఖండిస్తూ ఏక‌ప‌క్ష తీర్మానం చేద్దామ‌న్నారు. ఏప్రిల్ 22న జ‌రిగిన ఉగ్ర‌వాదుల‌ మార‌ణోమంలో 26మంది అమాయ‌క ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌మ్మూక‌శ్మ‌ర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను క‌లిసి రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని, ఐక్యంగా ఉండి ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌తిఘ‌టిదామ‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img