నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీతో కీలక భేటీ అయ్యారు. దేశరాజధాని ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైయ్యారు.ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. పహల్గాం దాడితో..పాకిస్థాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తదుపరి చర్యలపై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ఐఏ పహల్గాం విచారణను ముమ్మరం చేసింది. బైసరన్ లోయకు వెళ్లి పలు కీలక ఆధారాలు సేకరించింది. మరోవైపు భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా సెర్చ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ..ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నాయి. ఇప్పటికే తీవ్రవాద కార్యకాలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠాను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతేకాకుండా గడువులోపు పాకిస్థాన్ పౌరులు దేశం విడిచిపోవాలని,ఆ దేశ పౌరులను గుర్తించి పంపించి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.దీంతో దేశర్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పాక్ పౌరులకు కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పాకిస్థాన్ పౌరులను గుర్తించారు. ఈనెల 29న గడువు ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.
ప్రధానితో కేంద్ర రక్షణమంత్రి కీలక భేటీ
- Advertisement -
RELATED ARTICLES