- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
- Advertisement -