– అందుకే భారత్ సమ్మిట్
– నేడు, రేపు హెచ్‌ఐసీసీలో నిర్వహణ
– 100 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధుల రాక
– సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆధునిక ఆలోచనలతో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపడానికే భారత్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింసా, సత్యం, న్యాయం ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్లు తదితరులతో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనుంది. ‘భారత్ సమ్మిట్: డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ అనే థిమ్‌తో సర్కారు చేపడుతున్నది. ఇందులో ఆర్థిక న్యాయం, రాజకీయ, సాంఘీక న్యాయం, క్లైమేట్ జస్టిస్, సోషల్‌మీడియా, టెక్నాలజీ తదితర ఆరు అంశాలపై చర్చించనున్నది. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా రెండు బలమైన దేశాలైన అమెరికా, రష్యా మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండగా, ఎదుగుతున్న భారతదేశం అలీన విధానాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్లింది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడింది. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయని గుర్తుచేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండు రోజులపాటు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివద్ధి, వనరులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించింది. ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది. జెండర్, యూత్, న్యాయం తదితర అంశాలను ప్రజలకు చెప్పి వాటిని ఈ ప్రపంచానికి చాటేందుకు ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సైతం ఇందులో పాల్గొననున్నారు. ఈమేరకు గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏర్పాట్ల పరిశీలన
హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌కు సంబందించిన ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. సమ్మిట్ థీమ్ పోస్టర్లు, స్టాళ్లను తిలకించారు. వీరివెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీకార్యదర్శి గురుదీప్ సింగ్ సప్పల్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రపంచానికే మోడల్‌గా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES