Wednesday, April 30, 2025
Homeమానవిప్ర‌శ్న‌లు అడుగుతూ..స‌మాధానాలు వెదుకుతూ..

ప్ర‌శ్న‌లు అడుగుతూ..స‌మాధానాలు వెదుకుతూ..

శరణ్య జయకుమార్‌… 85 ఏండ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఆమెకు పోటీ పడటం అంటే ఎంతో ఉత్సుకత. తద్వారా జ్ఞానాన్ని పొందవచ్చని ఆమె ఆలోచన. అయితే తెలివిగా ఆలోచించడం, స్పందించడం కేవలం పురుషులకే సాధ్యం అని భావించే సమాజం మనది. అటువంటి పురుషాధిక్య ప్రదేశంలో ఓ మార్గదర్శకురాలిగా దాదాపు ఆరు దశాబ్దాలుగా ప్రశ్నలను వెతుకుతున్నారు. చర్చిస్తున్నారు, సమాధానాలు కనుగొంటున్నారు. నేర్చుకోవడం ఆపకుండా గడుపుతున్నారు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదని ఆచరణలో నిరూపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
శరణ్య మొదటిసారి క్విజ్‌ పోటీలోకి అడుగుపెట్టినప్పటి నుండి దశాబ్దాల తర్వాత కూడా ఆమెలోని జిజ్ఞాస, మక్కువ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక అలాగే ఉన్నాయి. ‘నిన్ననే నేను ప్రకృతి, భౌగోళిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్‌ రస్సెల్‌ వాలెస్‌ ఊహించినట్లుగా ఆసియా, ఆస్ట్రేలియా మధ్య జీవభౌగోళిక సరిహద్దు అయిన వాలెస్‌ లైన్‌ గురించి చదువుతున్నాను’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
మహిళలు చాలా తక్కువ
ఆమెకు క్విజ్‌తో పరిచయం 1950లలో ప్రారంభమైంది. ఆ సమయంలో క్విజ్‌ పోటీలో పాల్గొనే మహిళలు చాలా తక్కువ. అదీ ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉండేవారు. అప్పట్లో ఇంటర్‌ కాలేజియేట్‌ క్విజింగ్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చెన్నైలో రెండు ప్రధాన పోటీలు మాత్రమే జరిగాయి. మద్రాస్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ క్విజ్‌, ప్రతిష్టాత్మక జాన్సన్‌ కప్‌. పచ్చయ్యప్ప కళాశాల ప్రొఫెసర్‌ వీటికి ఆతిథ్యం ఇచ్చారు. క్వీన్‌ మేరీస్‌ కళాశాల విద్యార్థిగా, తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యార్థిగా ఉన్న శరణ్య క్విజింగ్‌ రంగంలో సంచలనం సృష్టించే కొద్దిమంది మహిళలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అప్పట్లో మహిళలు ఎక్కువగా లేరు. కానీ మేము దాన్ని ఆడామగా మధ్య జరిగే యుద్ధంగా ఎప్పుడూ చూడలేదు. పోటీ పడటానికి, గెలవడానికి మాత్రమే అక్కడ ఉన్నాము’ అంటూ పంచుకున్నారు. ఇలా పోటీల్లో పాల్గొని ఆమె విజయం సాధించారు, జాన్సన్‌ కప్‌ను అనేకసార్లు గెలుచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img