Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఫెడ్‌ చీఫ్‌ను తొలగించే ఉద్దేశం లేదు

ఫెడ్‌ చీఫ్‌ను తొలగించే ఉద్దేశం లేదు


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా ఫెడరల్‌ చీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ను తొలగించడం లేదని అధ్యక్షులు ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో ద్రవ్యోల్బణం పెరగనుందని ఇటీవల జెరోమ్‌ పావెల్‌ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌పై ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయనను పదవి నుండి తొలగిస్తారంటూ ప్రపంచమార్కెట్లలో ఆందోళనను రేకెత్తించాయి. ఈ అంశంపై మంగళవారం ట్రంప్‌ స్పందించారు. జెరోమ్‌ను తొలగించే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. వడ్డీరేట్లను తగ్గించడంపై పావెల్‌ మెరుగ్గా స్పందించాల్సివుందని తాను కోరుకుంటున్నానని అన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడానికి ఇది సరైన సమయమని అన్నారు. చైనాపై విధించిన ప్రతీకార సుంకాలపై ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ”145 శాతం సుంకాలు చాలా అధిక స్థాయి అని, ఇది గణనీయంగా తగ్గుతుంది” అని ట్రంప్‌ మంగళవారం అంగీకరించారు. చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, కానీ సున్నా మాత్రం కావని అన్నారు. చైనా తమతో ఏదైనా ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img