నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్దగుల్లా తాండా గిరిజన గూడెం లో జరిగిన కూలర్ కు విద్యుత్త్ ప్రసరణ జర్గిన సందర్భంగా ఇద్దరు తల్లి కూతుర్లు నిద్రావస్తలోనే మృత్యువాత పడిన ఇటీవలే జరిగింది. సంఘటనను పత్రికలలో వచ్చిన కథనాలను చూసి పలువురు మాజీ ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు . అందులో భాగంగా సోమవారం నాడు జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంపీ పాటీల్ బాధితుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బిబి పాటీల్ మాట్లాడుతూ ప్రజలు విద్యుత్తు తో జాగ్రత్తగా ఉండాలని , ఇలాంటి ప్రమాదాలు జరిగితే కుటుంబాలు విచ్ఛిన్నమై అధోగతి పాలవుతుందని , అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు . బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించామని ఆయన అన్నారు. మాజీ ఎంపి తో పాటు జుక్కల్ మాజీ జెడ్పిటిసి మాధవరావు దేశాయ్ , తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబికులకు పరామర్శించి ఆర్థిక సాయం చేసిన మాజీ ఎంపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES