Wednesday, April 30, 2025
Homeజాతీయంబాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హాం

బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హాం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌తంజ‌లి కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఫార్మ‌సీ కంపెనీ హ‌మ్‌ద‌ర్ద్‌కి చెందిన పాపుల‌ర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కోర్టు త‌ప్పుప‌ట్టింది. రూహ్ అఫ్జాను ష‌ర్బ‌త్ జిహాద్ అని రాందేవ్ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో హ‌మ్‌ద‌ర్ద్ కంపెనీ రాందేవ్‌పై కేసు దాఖ‌లు చేసింది. దానిపై ఇవాళ కేసు విచార‌ణ జ‌రిగింది. జ‌స్టిస్ అమిత్ బ‌న్స‌ల్ త‌న ఆదేశాల్లో క‌ఠిన‌మైన వార్నింగ్ ఇచ్చారు. ఇది కోర్టు అంత‌రాత్మ‌నే షాక్‌కు గురి చేస్తోంద‌ని, క్ష‌మించ‌రానిది అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఏప్రిల్ 3వ తేదీన బాబా రాందేవ్‌.. రూహ్ అఫ్జాపై విమ‌ర్శ‌లు చేశారు. త‌మ కంపెనీకి చెందిన గులాబ్ ష‌ర్బ‌త్ ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. హ‌మ్‌ద‌ర్ద్ కంపెనీ త‌న సంపాద‌న అంతా మ‌సీదులు, మ‌ద‌ర‌సాలు క‌ట్టేందుకు వినియోగిస్తున్న‌ట్లు కూడా రాందేవ్ ఆరోపించారు. షర్బ‌త్ జిహాద్ అన్న ప‌దాన్ని కూడా ఆయ‌న వాడారు. హ‌మ్‌ద‌ర్ద్ కంపెనీపై రాందేవ్ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, కంపెనీ ఓన‌ర్స్‌కు చెందిన మ‌తాన్ని ఆయ‌న అటాక్ చేస్తున్నార‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది ముఖుల్ రోహ‌త్గీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img