Tuesday, May 6, 2025
Homeజాతీయంబీజేపీ ఎంపీ దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌కు అనుమతి అవసరం లేదు: సుప్రీంకోర్టు

బీజేపీ ఎంపీ దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌కు అనుమతి అవసరం లేదు: సుప్రీంకోర్టు

- Advertisement -

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌ నమోదు చేయడానికి తమ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై తీవ్ర విమర్శలు చేసిన నిషికాంత్‌ దుబేపై కోర్టు ధిక్కార పిటిషన్‌ నమోదు చేయడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బిఆర్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కోర్టు ధిక్కార పిటిషన్‌ నమోదు చేయడానికి ఎలాంటి అవసరం లేదని తెలిపింది. ‘మీరు దాఖలు చేయండి’ అని పేర్కొంది. అయితే ఈ విషయంలో అటార్నీ జనరల్‌ నుంచి అనుమతి పొందాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ నెల 19న నిషికాంత్‌ దుబే బహిరంగంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు చట్టాలను చేయవల్సి వస్తే పార్లమెంట్‌ను, రాష్ట్ర అసెంబ్లీలను మూసివేయండని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే దేశంలో ‘అంతర్యుద్దాలు’కు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా బాధ్యుడని కూడా దుబే విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా పిటిషనర్ల తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది తన్వీర్‌ అటార్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -