Tuesday, April 29, 2025
Homeఆటలుబీసీసీఐ సంచలన నిర్ణయం..

బీసీసీఐ సంచలన నిర్ణయం..

నవతెలంగాణ – హైదరాబాద్: టిమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోచింగ్ స్టాఫ్‌ను తగ్గిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నిరుడు జులైలో నియమించిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది. స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో కివీస్, ఆసీస్ జట్లపై రోహిత్ సారథ్యంలోని భారత జట్టు దారుణ పరాభవం ఎదుర్కొంది. ఈ ఓటములపై తాజాగా బోర్డు సమీక్షించింది. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్నా కోచ్‌లు ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. దీంతో నాయర్‌పై వేటు తప్పదన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలను నిజం చేస్తూ నాయర్‌పై బీసీసీఐ వేటు వేసింది.అలాగే, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలిసింది. జులైతో వీరి కాంట్రాక్ట్ ముగియనుండగా దిలీప్‌ స్థానంలో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్న టెన్‌ డెస్కటే ఫీల్డింగ్‌ కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తాడని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్‌ లీ రౌక్స్‌ మరోసారి సేవలు అందించనున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img