భారతీయ మీడియా దాదాపు మోడీయాగా మారిపోయిందన్న విమర్శ చాలాకాలంగా ఉంది కూడా. కీలక అంశాల్లో సైతం వాస్తవాల పరిశీలన, లోతైన అధ్య యనం లేకుండా కేవలం కేంద్ర పాలక పక్షమైన బీజేపీ, ఆరెస్సె స్‌లు చేసే ప్రచారాన్ని మోత మోగించడం బడా మీడి యాకు పరిపాటిగా మారింది. ప్రధాన మంత్రి మోడీపైన, ఆయన మంత్రివర్గ సహచరుల పైన, ఆయనకు సన్నిహితులైన కార్పొరేట్ అధినేతలపైన వచ్చే ఆరోపణలను ముక్తసరిగా ముగించటం బీజేపీ వ్యతిరేక లౌకిక, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ప్రతి అంశం భూతద్దంలో చెప్పడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో అన్ని వ్యవస్థలను అపహస్యం చేయడానికి కూడా బడా మీడియా వెనుకాడటం లేదు. కరోనా సమ యంలో అయితే ఇది పరాకాష్టకు చేరింది. ప్రభుత్వానికి భజన చేసే మీడియాను నెత్తిన పెట్టు కోవడం ఒకటైతే విమర్శించే వారిని నిర్బంధాల పాలు చేయడం, నిషేధిం చడం, వేధింపులకు గురిచేయటం నిత్యకృత్యమైంది. న్యూస్‌క్లిక్, వైర్ న్యూస్‌లతో సహా అనేక ప్రాంతీయ మీడి యాలు, నిర్భయంగా పనిచేసే సంపాదకులు, జర్న లిస్టులు, రచయితలు, అధ్యాపకులు నిఘా నేత్రానికి అక్రమ కేసులకు గురికావాల్సి వచ్చింది. రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం వంటిది వస్తే నెలల తరబడి కథనాలు ఇచ్చిన మీడియా అతని కంపెనీ… అక్రమ విద్యుత్ ఒప్పందాల గురించి, అమెరికా సంస్థ లు, అధికార వ్యవస్థల వివరాలు బయటపెట్టిన కేసుల లోతుపాతుల్లోకి పోకుండా పైపై వార్తలతో సరి పెట్టిం ది. దేశం, రాష్ట్రాలకు సంబంధించిన ఈ కథలన్నీ అలా ఉంచితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ సాయుధ సంఘర్షణ, టెర్రరిస్ట్ హత్యాకాండ నేపథ్యంలో భారతీ య మీడియా మరీ దారుణంగా తయారైంది. కాల్పుల విరమణ తర్వాత దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా దాని పాత్రపై వివరమైన అధ్యయనాలు జరుగు తున్నాయి.సంచలన కథనాలు వెలువడుతున్నాయి.
యుద్ధం కోసం బులపాటం
బాధ్యతా రాహిత్యంతో అవాస్తవాలను, అసత్యా లను ప్రచారంలో పెట్టిన తీరుకు ప్రపంచం విస్తుపోతు న్నది. భస్మాసుర హస్తంలా ఇది చివరకు తనను సృ ష్టించిన నరేంద్ర మోడీ సర్కారుకే ఇరకాటంగా పరిణ మించింది. మోడీకి ఈ మీడియానే అతిపెద్ద ప్రతి కూలాంశంగా మారిందని అల్‌జజీర్ సమగ్ర కథనాలు, చర్చలు ప్రచారం చేసింది. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం పతాక శీర్షికతో ప్రచురించింది. దేశంలో కూడా వైర్‌న్యూస్ వంటి వెబ్‌సైట్లు ఫొటోలు, కథనాలు ఇచ్చాయి. ఉద్రిక్తత తారాస్థాయికి చేరిన, యుద్ధ మేఘాలు అలుముకున్న, దాడులు జరుగుతున్న ఒక పూర్వ రంగంలో మీడియా ఎంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగు తుంది. కేవలం నాలుగు రోజుల పరాకాష్టల్లో సాగిన ఈ సాయుధ సంఘర్షణపై కథనాలు ఎలా నడిచాయో వాస్తవాలేమిటో వెనక్కు తిరిగి చూసుకోవడం ఇప్పుడు అందరికీ సాధ్యమే. తెలుగుతో సహా ప్రాంతీయ మీడి యా కూడా ఇదే ఒరవడిలో సాగింది కనుక ఎవరైనా ఈ అంశం స్వయంగా పరిశీలించవచ్చు. కాకపోతే జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను తాము ప్రసారం చేశా మని ప్రాంతీయ మీడియాలు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.కానీ కోట్లమంది ప్రజలు వీక్షించే ప్రాంతీయ మీడియా బాధ్యత కూడా తక్కువ కాదు. ఒక విధంగా సామాన్య ప్రజలను చేరేది అదే గనుక మరింత ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది.
అసత్యాలపై రాజ్‌దీప్ క్షమాపణ
భారత్,పాకిస్తాన్ ఘర్షణపై మీడియా అనుసరించిన కథనాల శైలి బయటి దేశం మీదకాక స్వదేశం మీదనే దృష్టి పెట్టినట్లు సాగిందని విమర్శకుల విశ్లేషణ. అంటే దేశంలో వీక్షకులను సంచలన కథనాలతో ఆకట్టుకొని రేటింగ్ పెంచుకోవడం మతాల వారీ విద్వేషాలు పెంచి మైనార్టీలపై ద్వేషం రెచ్చగొట్టడం అనే రెండు లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. సాధారణంగా సోషల్ మీడియానే ఇందుకు కారణమని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ఘర్షణ సమయంలో ప్రధాన మీడియా అన్నది కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం ఆందోళనకరం. ఆర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ వంటివి టీవీ స్టూడియోలను యుద్ధ రంగాలుగా మార్చేశాయి. తుపాకుల బొమ్మలు, ఆయుధాలు, చెట్లు నమూనాలతో మరింత ఉద్రిక్తతకు కారణమ య్యాయి. దాడులపై నిరాధారమైన కథనా లిచ్చాయి. ఇది ఎంతవరకు పోయింది? ఏ స్థాయిలో సాగింది? అంటే సీనియర్ సంపాదకుడైన రాజ్‌దీప్ సర్దేశారు ఆధారం లేని కొన్ని కథనాలు చెప్పినందుకు క్షమా పణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆర్ణబ్ గోస్వామి అందుకు సిద్ధ పడలేదు కానీ అంతకంటే ఘోర ంగా రెచ్చిపోయి వ్యవహరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే పాకిస్తాన్ మీడియా కూడా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా అసత్య కథనాలతో ఆవేశం పెంచడానికి పనిచేసింది. ఆ మీడియాని గనుక నమ్మినట్ల యితే ఢిల్లీపై దాడి జరిగిందని భావించాల్సి వచ్చేది.
ఆర్ణబ్ గోస్వామి కథనాల ప్రకారం 400 డ్రోన్లను భారత సైన్యం ఒక్కదెబ్బతో పేల్చి వేసింది. పాకిస్తాన్‌లో సైనిక కుట్రే జరిగి పో యింది. దాడి కకావికలం చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ బయల్దేరి కరాచీ రేవును ధ్వంసం చేసింది. ఇండియా న్యూస్‌టీవీ కథనం ప్రకారం లాహోర్ ధ్వంసమైంది. ఎన్. డిటివి కథనం ప్రకారం ట్యాంకులు కూల్చివేయ బడ్డాయి. 17 జె.ఎఫ్ విమానాలను, ఎఫ్16 విమానాలను పాకిస్తాన్ నుంచి భారత సైన్యం పట్టుకు న్నదని ఇండియాటుడే కథనం ప్రసారం చేసింది. ఆజ్ తక్ ఛానల్‌లో అంజనా మిశ్రా, శ్వేతా కశ్యప్ ఆవేశ పూరితమైన కథనాలు ఇవ్వటమే కాకుండా పాకిస్తాన్ సూసైడ్ దళాలు సైన్యంపై దాడికి కుట్ర పన్నాయని ప్రసారమైంది. ఎ.బి.పి, జి న్యూస్‌లు పాక్ సైనిక దళాలు ప్రధాన అధికారి మునీర్‌ను తొలగిం చేసినట్టు ప్రసారం చేసింది. 450 మంది ప్రయివేటు సైన్యం దాడి చేస్తున్న ట్లుగా అజరు శర్మ కథనం ఇచ్చారు. ఉదాహరణలు చెప్పా లంటే స్థలా భావం అడ్డొస్తుంది. ఇలాంటి కథనా లతో రాజస్థాన్ సరిహద్దుల్లో ప్రజలు చాలా ఆందోళన చెందారని కూడా తర్వాత బయటకు వచ్చింది. ఈ వివరాలన్నింటి నిజా నిజాలను ఆల్ట్ న్యూస్, క్వింట్ వంటివి బయటపెట్టాయి. పంజాబ్ కాంగ్రెస్ నాయ కుడు రాజీవ్ శర్మ ఈ అసత్య కథనాల సుదీర్ఘ జాబితాను తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అభిషేక్ మాలిక్ వివరమైన విశ్లేషణ రాశారు. న్యూ యార్క్ టైమ్స్‌లో అనుప్రీత దాస్, ప్రగతి రుచిలోతుగా పరిశీలించారు. దక్షిణాసియాలో అసత్య సమాచార యంత్రాంగంపై పరిశోధన చేసే అమెరికన్ యూనివర్సిటీకి చెందిన డా|| సుమిత్ర బద్రీనాథ్ ఇది ఒక పెద్ద బెడదగా తయారైందని నివేదించారు. ఈ అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే కథనాలు ఎంత దూరం వెళ్లాయంటే చివరకు రక్షణ శాఖ కూడా ఆందోళన చెంది ఇలాంటి వాటిని విరమించాలని ఆదేశించింది. సైనిక దళాల కదలికలు, ఆయుధ ప్రయో గాలను అధికారికంగా అనుమతిస్తేనే ప్రసారం చేయాలి కానీ కేవలం ఇతర వనరుల ఆధారంగా కథనాలు ఇవ్వరాదని హెచ్చరించింది. ఎందుకంటే సైనిక దళాల కదలికల గురించి, విమానాల గురించి, దాడుల ఫలితాల గురించి భారతీయ మీడియాలో వచ్చే కథనాలు పాకిస్తాన్ ప్రచార దాడికి సాధనాలవుతాయి కనుక ఈ ప్రకటన చేయవలసి వచ్చింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఇలాంటి కథనాలు పూర్తిగా ఆగిపో యాయని చెప్పలేము.
సత్యాలకే శిక్ష-కట్టు కథలకు బహుమానం
మోడీ ప్రభుత్వ వైఖరి కూడా ఈ పరిస్థితికి ఒక ప్రధాన కారణం. ఆపరేషన్ సిందూర్ మొదలైనప్పటి నుంచి రైల్వే టికెట్లపై ఆ పేరుతో మోడీ బమ్మలు ముద్రి స్తున్న ప్రస్తుత సమయం దాకా ఈ పరిణామా లను రాజకీయ ప్రచారానికి వాడుకోవటం అన్నది ఒక వ్యూ హంగా తయారైంది. తొలిదశలో ఈ ధోరణులను ప్రోత్స హించడం వల్ల అవి తర్వాత అదుపుతప్పి పోయాయి. నాలుగు రోజుల్లోనే కాల్పుల విరమణ జరిగాక ఇదంతా ఒక రహస్యంగా తయారైంది. ఈ నాలుగు రోజుల్లోనూ సంఘపరివార్ నేతలు క్రమ పద్ధతిలో కథనాలు వదు లుతూ వచ్చారు. చానళ్లలో, పత్రికల్లో రెచ్చగొట్టే ప్రసం గాలు చేశారు. ఒక విధంగా మతతత్వ రాజకీయాలతో మతపరమైన విభజన పెంచే విద్వేష వాదనలు చేశారు. సోషల్ మీడియాకు, ప్రధాన మీడియాకు అసత్య సమాచారాలు రావడానికి కారకుల య్యారు కొందరు. తమాషా ఏమంటే కేంద్రం ఇలాంటి శక్తులను అదుపు చేయడానికి బదులు… వాస్తవాలను బాధ్యతాయుతంగా అందిస్తున్న వైర్ వంటి పత్రికలపై… మూత బూచి వేయడానికి ప్రయత్నించింది. మధ్యప్రదేశ్ మంత్రి విజరు సైనిక దళాల తరఫున మాట్లాడిన సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరి అని దుర్భాషలాడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా క్షమాపణలు చెప్పమని ఆదేశిస్తే, బీజేపీ నాయకులు, ప్రభుత్వాల నేతలు ఒక చర్య కూడా తీసుకోలేదు. కానీ అలీఖాన్ మహమ్మద్ వంటి ప్రొఫెసర్లను నిష్కారణంగా అరెస్టు చేసిన తర్వాత వారికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. కేంద్రంగానీ బీజేపీ నాయకులు కానీ ఇంత అసంబద్ధంగా వ్యవహరిం చడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఈ ఘర్షణను విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వారు ఆశించిన రాజకీయ ప్రయోజనం కలగలేదు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో హఠాత్తుగా విరమించారన్న విమర్శ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తాము ట్రంప్‌కు ఈ విషయాలు చెప్పలేదని పార్ల మెం టరీ ప్రతినిధి వర్గాలకు వివరణ ఇస్తున్నారు. ముందుగా పాకిస్తాన్ డిజిఎంఓ తమను సంప్రదించాకే కాల్పులు విరమణ జరిగిందని ఆయన అంటున్నారు. అదే నిజమైతే ఇంత ఘర్షణ తర్వాత బేషరతుగా కాల్పుల విర మణకు మోడీ ప్రభుత్వం అంగీకరించిందని భావిం చాలా? శాంతి పునరుద్ధరణ మంచిదే అయినప్పటికీ అప్పగించడం వంటి కనీసమైన షరతులు కూడా పెట్టలేదా?అణ్వాయుథ నిల్వలున్న ‘కిరణా హిల్స్’ ముఖద్వారాన్ని మిసైల్స్ ఢకొీట్టడం వంటి వార్తలు చాలా వచ్చాయి కానీ ఇప్పుడు విక్రమ్ మిస్రీ ఏ దశలోనూ పాకిస్తాన్ అణ్వాయుధ వినియోగం గురించి చెప్ప లేదని ఎంపీలకు వివరించారు. అంటే ఇరుదేశాల్లోనూ ప్రసా రమైన రెచ్చగొట్టే కథనాలు కేవలం కల్పితాలని అర్థం కావడం లేదా? ఉద్రిక్తత తగ్గాక ఈ సంచలనాలు చేయ టం వేరు. సరిహద్దులు రగిలిపోతున్న సమయంలో నిరా ధారమైన కథనాలు చలామణి చేయడం వేరు. ఈ విషయంలో బడా మీడియా వ్యవహరించిన తీరు దేశానికి తలవంపులు తేవడమే కాక గతంలో ఉన్న మీడి యా ప్రతిష్టను మరింత దిగజార్చింది. భారతీయ మీడి యా ఇలా వ్యవహరించటం మామూలు అయి పోయిం దని అంతర్జాతీయ సంస్థలు తేల్చివేశాయి.
బెడిసికొట్టిన హడావుడి
ప్రకృతిలో కుక్కతోక తరహాలో కొన్ని వంకరగానే వుంటాయి.ఈ మీడియా సంస్థలూ, మోడీ భజన బృం దాలు కూడా అందుకు నకళ్లలాగా వ్యవహరించడం హాస్యాస్పదం. సాయుధ ఘర్షణలో అసత్య ప్రచారాలు, విర మణతో విన్యాసాలు చేశాయి సరే. ఇప్పుడు దేశం కోసం అన్ని పార్టీలూ విదేశాలలో దౌత్య ప్రచార బృందాల్లో కలసి వస్తే ఇదీ మోడీ ఘనతగా మీడియా చిత్రిస్తున్నది. మొదటే చెప్పినా వినకుండా యుద్ధ హడావుడి తర్వాత దౌత్య మార్గం వైపు తిరగవలసి వచ్చిందనేది వాస్తవం. ఇందు లోనూ శశిథరూర్ వంటి భజనమూర్తుల కక్కుర్తి వేషాలకే అధిక ప్రచారం ఇస్తూ మోడీ సర్కారు చిన్నబుద్ధిని దాచిపెడుతోంది. మొత్తానికి ఇప్పుడు దేశంలో ఇతర పార్టీలపైనా విశ్వగురుడే గెలి చాడని బడామీడియా హైప్ సీజన్-2 పెంచ బోతోంది. తథాస్తు, మరి. తర్వాత అదీ చూద్దాం!
తెలకపల్లి రవి
బెడిసికొట్టిన మోడియా హడావుడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES