నవతెలంగాణ-హైదరాబాద్ : గద్వాలలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న విద్యార్థినుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం కొందరు నర్సింగ్ విద్యార్థినులు కాలేజ్ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడి ఉండగా.. వారిపైకి వాహనం దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం బొలేరో వాహనం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -