పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాకి స్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతం చేసింది.
ఎవ్వరూ ఊహించని రీతిలో ఉగ్ర స్థావర లక్ష్యాలను అత్యంత చాకచక్యంతో భారత సైన్యం పేల్చిన వైనానికి యావత్ భారతం జేజేలు పలికింది.
ఓ పక్క ఆయుధాలతో దాయాది దేశానికి బుద్ది చెబుతూనే మరోపక్క వ్యూహాత్మంగా పాకిస్థాన్‌పై అన్ని విధాలుగా ముప్పేట దాడి చేసేందుకు భారత ప్రభుత్వం పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే మన దేశం నుంచి వెళ్ళే నదీజలాలను పాక్‌లోకి వెళ్ళకుండా ఆపేసింది. ఇక తాజాగా వినోద రంగం విషయంలోనూ భారత్ ప్రతీకార చర్యలకు తెరలేపింది.
వినోదం విషయంలో ఓటీటీలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. భాషా సరిహద్దులను సైతం చెరిపేశాయి. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు శుక్రవారం సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌లు, మధ్యవర్త్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్‌స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు.
ఓటీటీ వేదికలు పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు అని సమాచార, మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తాజా నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్, జియో సినిమా సహా అన్ని ఓటీటీ వేదికలు పాక్ కంటెంట్ స్ట్రీమింగ్‌ను భారత్‌లో కచ్చితంగా నిలిపివేయాల్సిందే.
భారత్‌లో పాక్ ఓటీటీ కంటెంట్ ప్రసారానికి బ్రేక్
- Advertisement -
- Advertisement -