నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ కు చెందిన వ్యక్తిపై, రెండు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని యూఎస్ ట్రెజరరీ విభాగం ప్రకటించింది. ఇరాన్ ఆయిల్ సరఫరాకు సాయం చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భారత్‌కు చెందిన జగ్వీందర్ సింగ్ బరార్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కంపెనీలు దాదాపు 30 నౌకలను నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు భారత్‌లోని గ్లోబల్ ట్యాంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బి అండ్ పీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో జగ్వీందర్ బరార్ కు కంట్రోల్ ఉంది. అయితే, బరార్ కు చెందిన నౌకలు.. ఇరాన్ ‘షాడో ఫ్లీట్’లో భాగంగా పనిచేస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ కార్గోల ద్వారా ఇరాన్ చమురును మారుపేరుతో అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తున్నాయని పేర్కొంది. దీంతో జగ్వీందర్‌తో పాటు, భారత్‌కు చెందిన ఆయన కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది.
అంతేగాక, బరార్ కు హౌతీలతోనూ ఆర్థిక సంబంధాలున్నాయని యూఎస్ ట్రెజరరీ విభాగం పేర్కొంది. బరార్‌కు చెందిన కార్గోలు ముప్పు కలిగించే ఆయిల్ సప్లయ్ లో పాల్గొంటున్నాయని ఆరోపించింది. ఇరాన్ పెట్రోలియంను ఇరాక్, యూఏఈ, గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలాల్లో తరలిస్తున్నాయింది. ఈ కార్గోలను అందుకున్న ఇతర సంస్థలు.. వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన చమురు ఉత్పత్తులతో వీటిని కలుపుతున్నాయని పేర్కొంది. ఇరాన్ పేరును దాచిపెట్టి నకిలీ పత్రాలతో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు అని అమెరికా అధికారులు ఆరోపించారు. అందుకే ఆంక్షలు విధింటినట్లు తెలిపారు. కాగా.. ఇలాంటి ఆరోపణలతో గతంలోనూ కొన్ని సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది.
భారత్ కు చెందిన రెండు సంస్థలపై అమెరికా ఆంక్షలు..
- Advertisement -