Wednesday, May 21, 2025
Homeఅంతర్జాతీయంభారత్, పాకిస్థాన్‌.. రెండు దేశాలూ చాలా దగ్గర: ట‌్రంప్

భారత్, పాకిస్థాన్‌.. రెండు దేశాలూ చాలా దగ్గర: ట‌్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల కోసం ట్రంప్‌ ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని చెప్పుకొచ్చారు. ‘నాకు భారత్, పాకిస్థాన్‌.. రెండు దేశాలూ చాలా దగ్గర. కశ్మీర్‌ ప్రాంతంలో 1,500 ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ రెండు దేశాల గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కరించుకుంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు ఉగ్రదాడి ఘటనపై స్పందించిన ట్రంప్‌.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, భారత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -