Monday, May 12, 2025
Homeజాతీయంభార‌త్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం

భార‌త్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ఏప్రీల్ 22న జ‌రిగిన ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో భార‌త్-పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెలకొన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాలు దౌత్య‌ప‌రంగా ప‌లు ఆంక్ష‌లు విధించుకున్నాయి. అంతేకాకుండా మే 7న ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పాక్ లోని ప‌లు ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త్ ఆర్మీ దాడి చేసింది. దీంతో దాయాది దేశం కూడా ఇండియాపై ప్ర‌తి దాడుల‌కు దిగిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజుల‌పాటు రెండు దేశాల్లో ప‌ర‌స్ప‌ర దాడుల‌తో తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. క్షిప‌ణుల‌తో, డ్రోన్ల‌ల‌తో , ఎత్తుల‌కు పైతులు వేస్తూ దాడులు చేసుకున్నాయి. తాజాగా భార‌త్-పాక్ ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌తో ఆయా దేశాల్లో ప‌రిస్థితులు శాంతిని త‌ల‌పిస్తున్నాయి. భార‌త్ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన‌ జ‌మ్మూక‌శ్మీర్, పంజాబ్, రాజ‌స్థాన్ ల్లో ప్ర‌శాంత్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎలాంటి అల‌జ‌డి లేని అహ్ల‌ద‌క‌ర‌మైన ప‌రిస్థితులు త‌ల‌పిస్తున్నాయి. రోజువారిలాగానే ప్ర‌జ‌లు త‌మ ప‌నుల‌ను నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో భార‌త ఆర్మీ హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది. క్ష‌ణ్ణాన దాడి జ‌రిగిన ఎదురుకొనేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. జ‌మ్మూలోని పూంచ్, ఉరి, కుప్వారా, రాజ‌స్థాన్‌లోని బార్ముర్‌, పంజాబ్‌ అమృత్‌స‌ర్‌లోని ప‌లు ఆధ్యాత్మిక కేంద్రాల‌ ద‌గ్గ‌ర అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించి నిఘా పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -