నవతెలంగాణ – హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందేగానే కేరళను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో వైపు మహారాష్ట్రలోని ముంబయిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రజలను ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. దాదార్, మహిమ్, పరెల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలు.. కేరళలో రెడ్ అలర్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



