నవతెలంగాణ హైదరాబాద్: జూబ్లీహిల్స్ కు చెందిన నీలి నాని (21) అనే యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం కొల్చారం మండలం ఏడుపాయల వద్ద మంజీరా నది వద్ద చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన నాని బాబు, నది ప్రవాహాన్ని చూసి బ్రిడ్జి కిందకు వెళ్లి సెల్ఫీ తీయబోయి ప్రమాదానికి గురయ్యాడు. సెల్ఫీ దిగుతూ కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో కొల్చారం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, నాని బాబు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని తండ్రి సత్తిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.