నవతెలంగాణ-హైదరాబాద్: క్లాస్‌రూమ్స్ కుంభకోణం ఆరోపణలపై ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అవినీతి కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,748 తరగతుల నిర్మాణంలో అవినీతికి పాల్పడినట్లు ఎసిబి ఆరోపించింది. కుంభకోణం సుమారు రూ.2,000 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపింది. తరగతి గదులను ఒక్కొక్కటి రూ.24.86 లక్షలకు నిర్మించినట్లు నివేదికలో పేర్కొన్నారని ఎసిబి ఆరోపించింది. అధిక ధరలకు కాంట్రాక్టులను ఇచ్చారని, ఇది సాధారణ ఖర్చు కంటే సుమారు ఐదు రెట్లు అధికమని ఎసిబి ఒక నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టును ఆప్‌తో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు ఆరోపించింది.
- Advertisement -