నవతెలంగాణ – క్విటో : లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో ఏప్రిల్ 13 ఆదివారం రోజు రెండవసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, కన్జర్వేటివ్ అభ్యర్థి డేనియల్ నోబోవాకు, లెఫ్ట్‌ఫ్రంట్ కూటమి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్‌ల మధ్య గట్టి పోటి నెలకొంది. నిన్న జరిగిన ఎన్నికల్లో మరోసారి నోబావానే గెెచినట్లు జాతీయ ఎన్నికల మండలి (సిఎన్‌ఇ) ప్రకటించింది. అయితే ఎన్నికల ఫలితాలను, ఎన్నికలు జరిగిన ప్రక్రియను లూయిసా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, మోసం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలను ఆమె తిరస్కరించినట్లు ప్రకటించారు. ఓట్లను తిరిగి లెక్కించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మోసం జరిగడం వల్లే డేనియల్ నోబోవా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆమె తీవ్రంగా విమర్శించారు. కాగా, ఈ ఎన్నికల్లో నోబావా గెలగవడంపైన ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. సత్యం కంటే అబద్ధాలను ఇష్టపడే ప్రజలు ఉన్నారంటే నేను నమ్మను. మేము మా ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుంటాము. ఈక్వెడార్‌ను శాంతి, అభివృద్ధివైపు నడిపించలేని వ్యక్తి, తమ వ్యాపారానికి, తమ కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి తిరిగి పాలించకూడదు. అందుకే మేము పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేస్తున్నట్లు లూయిసా ప్రకటించారు. ఈ ఏడాది పిబ్రవరిలోనే మొదటిసారి ఈక్వెడార్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పుడు లూయిసా గొంజాలెజ్‌కు 43.9 శాతం, డేనియల్ నోబోవాకు 44.2 శాతం ఓట్లను గెలుచుకున్నారు. అయితే ఎవరూ 50 శాతం ఓట్లు పొందలేకపోవడంతో రెండవ ఎన్నికలు ఏప్రిల్ 13న జరిగాయి. ఈసారి ఎన్నికల్లో ఎవరూ ఊహించనంతగా నోబావా 56 శాతం ఓట్లను గెలుచుకుని మరోసారి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. లూయిసా 44 శాతం ఓట్లను సాధించకున్నారు. వీరిద్దరి మధ్య కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే తేడా. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో లూయిసాకు ఎక్కువ ఓట్లు సాధించుకుంటే.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే నోబావా ఆమె కంటే 12 శాతం ఓట్లను గెలుచుకుకోవడం గమనార్హం.
మరోసారి అధ్యక్షుడైన డేనియల్.. ఎన్నికల ఫలితాల్ని తిరస్కరించిన లెఫ్ట్‌ఫ్రంట్
- Advertisement -
RELATED ARTICLES