నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. ఇండియాన్ జవాన్లే లక్ష్యంగా కాల్పులు తెగబడుతోంది. దీంతో అప్రమత్తం ఉన్న భారత్ బలగాలు..ఆ దాడులకు దీటుగా ప్రతిస్పందిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎల్‌వోసీ వద్ద పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు భారత్ అధికారులు చెప్పారు. తమ బలగాల అప్రమత్తతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఎల్‌వోసీ సరిహద్ద ప్రాంతాలైన కుప్వారా, బారాముల్ల, పూంచ్ జిల్లా పరిధితో పాటు నౌషేరా, అఖ్నూర్ సెక్టార్‌లు వెంబడి కాల్పులకు జరుపుతున్నారని అధికారులు వెల్లడించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉన్మాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి . ప్రతి ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి.
మరోసారి పాక్ సైన్యం ఎల్‌వోసీ వద్ద కాల్పులు
- Advertisement -
RELATED ARTICLES