Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంమాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూత

- Advertisement -

– పలువురు ప్రజాప్రతినిధులు, నాయకుల నివాళి
నవతెలంగాణ-ఓయూ

హైదరాబాద్‌ ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం కోసం రాజిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ హబ్సి గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేపీ వివేకానంద, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సుభాష్‌ రెడ్డి, కార్పొరేటర్లు, పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం రాజిరెడ్డి కుటుంబ సభ్యులను, సోదరుడు బండారి లక్ష్మారెడ్డిని పరామ ర్శించారు. రాజిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చిర్యాలలోని బండారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిం చనున్నారు. బండారు రాజిరెడ్డి 1945లో హైదరాబాద్‌ నాచారంలో జన్మించారు. మల్లాపూర్‌ జడ్పీ స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో పలు పదవులను ఆయన చేపట్టారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మెన్‌గా పని చేశారు. 2012లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సేవలందించారు. 2009 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై 28 వేలకు పై చిలుకు ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన సోదరు డు బండారు లక్ష్మారెడ్డి 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నియోజక వర్గానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి :
ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే మృతికి సీఎం సంతాపం
ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మృత్తి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి, తన నియోజక వర్గానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. రాజిరెడ్డి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -