Sunday, May 18, 2025
Homeజిల్లాలుమావోయిస్టులకు గుత్తికోయ యువత సహకరించవద్దు.. 

మావోయిస్టులకు గుత్తికోయ యువత సహకరించవద్దు.. 

- Advertisement -

– తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి 

నవతెలంగాణ – తాడ్వాయి 

గిరిజన(గుత్తి కోయ)యువత మావోయిస్టులకు సహకరించవద్దని స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొండాలతో తోగు గుత్తి కోయగూడాన్ని తన పోలీసు బలగాలతో కలిసి సందర్శించి, పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే అవకాశం అధికంగా ఉంటుందని, వారి మాయమాటలు నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని గిరిజన యువతకు సూచించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల వస్తే పోలీసులకు లేదా 100 కాల్ చేసి సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని, ఏ సమస్యలు ఉన్న పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువు పై దృష్టి సారించాలన్నారు. చిన్నపిల్లలతో కూలి పనులకు పంపియరాదన్నారు. మండలంలో ఎలాంటి అసాంఘిక శక్తులకు తావివ్వరాదన్నారు. గుత్తి కోయలు అడవులను నరకడం, వన్య మృగాలను వేటాడడం చట్టరీత్యా నేరం అని తెలిపారు. అనంతరం గుత్తి కోయ పిల్లలకు బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -