‘అన్న నిలుచుంటే మాస్.. అన్న నడిచొస్తే మాస్.. అన్న ఫ్యాంటేస్తే మాస్.. అన్న షర్టేస్తే మాస్…’ అక్కినేని నాగార్జున నటించిన మాస్ సినిమాలోని ఓ పాట ఇది. మాజీ మంత్రి మల్లన్న (చామకూర మాల్లారెడ్డి)ని కూడా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, యూట్యూబ్ అభిమానులు ఇదే రకంగా ‘మా అన్న ఏది చేసినా మాసే…’ అంటూ తెగ పొగిడేస్తుంటారు. ‘నేను పాలమ్మిన, పూలమ్మిన, ఇంజినీరింగ్ కాలేజీ పెట్టిన, మెడికల్ కాలేజీ నడుపుతున్న, ఎమ్మెల్యేనయిన, ఆఖరికి మంత్రి కూడా అయిన, నన్నుజూసి జర నేర్చుకోండ్రా బరు…’ అంటూ తాను ఎదిగిన తీరును వివరించినా, శాసనసభలో ‘నీకు దండం పెడ్త సార్, నన్ను మాట్లానీయ్యండి…’ అన్నా, ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్‌ఎస్ నీరసంగా ఉన్న ప్పుడు, అదే పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ డెబ్బయి ఏండ్ల తన వయసును కూడా లెక్క చేయకుండా విదేశాల్లో విహారయాత్రలు చేసి, సముద్రంలో, ఆకాశంలో జంప్‌ల జంప్‌లు చేసినా..అది మల్లన్నకే చెల్లింది. ఇప్పుడు రాజకీయాల మీద వైరాగ్యం వచ్చిందో లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయో తెలియదుగానీ… ‘నాకు 73 ఏండ్లు వచ్చాయి, ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నా, ప్రజాసేవలోనే నిమగమవుదామనుకుంటున్నా…’ అంటూ మల్లన్న సెలవిచ్చారు. సరే…ఆయన నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా?లేక ఏదోమాట వరసకు అన్నారా? అనేది వేచి చూడాలి. కాకపోతే మాస్ మల్లన్న ఏది మాట్లాడినా అది సంచలనమే. టీవీ ఛానళ్లు, యూట్యూబ్‌లకు మాంచి మసాలా దొరికినట్టే.
-బి.వి.యన్.పద్మరాజు
మాస్ మల్లన్న….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES