Tuesday, March 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమా డేటా సెంటర్లపై డ్రోన్ల దాడి నిజమే: అమెజాన్‌

మా డేటా సెంటర్లపై డ్రోన్ల దాడి నిజమే: అమెజాన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : తమ డేటా సెంటర్లపై ఇరాన్‌ దాడి నిజమేనని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ధ్రువీకరించింది. యూఏఈ, బహ్రెయిన్‌లో ఉన్న డేటా సెంటర్లపై డ్రోన్లతో దాడి జరిగిందని వెల్లడించింది. దీంతో తమ సర్వీసులకు అంతరాయం కలిగినట్లు చెప్పింది. యూఏఈలోని రెండు డేటా సెంటర్లపై నేరుగా డ్రోన్ల దాడి జరిగిందని, బహ్రెయిన్‌లోని డేటా సెంటర్‌కు సమీపంలో దాడి జరిగినట్లు తెలిపింది. భారీగా మంటలు చెలరేగడంతో నిర్మాణాత్మక నష్టం వాటిల్లినట్లు సంస్థ వెల్లడించింది. మౌలిక సదుపాయాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -