Tuesday, April 29, 2025
Homeజాతీయంమీడియా సంస్థ‌ల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

మీడియా సంస్థ‌ల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో యావ‌త్తు దేశం ఉలిక్కిప‌డింది. 26మంది అమాయ‌క ప‌ర్యాట‌కుల‌ను ఉగ్ర‌వాదులు పొట్ట‌న‌బెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను ఆచూకీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంది. అదేవిధంగా జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేతే ల‌క్ష్యంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశానుసారం జ‌మ్మూక‌శ్మీర్ వ్యాప్తంగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. అయితే ఆర్మీ చేప‌ట్టిన‌ కార్యకాలాపాల‌పై ప‌లు ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లు విచ్చ‌ల‌విడిగా క‌థ‌నాలు వెలువ‌రిస్తున్నాయి. ఆర్మీ చేప‌ట్టే చ‌ర్య‌ల‌పై లైవ్ క‌వ‌రేజ్ చేయ‌కుండా మీడియా సంస్థ‌లు నియంత్ర‌ణ పాటించాల‌ని కేంద్ర స‌మాచార శాఖ పేర్కొంది. ఈమేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జాతీయ భ‌ద్ర‌త దృష్ణ్యా అన్ని మీడియా సంస్థలు, ప్రింట్ ప‌త్రిక‌లు, న్యూస్ ఏజెన్సీలు, సోష‌ల్ మీడియా త‌దిత‌ర క‌మ్యూనికేస‌న్ స‌మ‌న్వ‌యం పాటించాల‌ని తెలిపింది. రూల్స్ ను ఉల్లంఘించిన ఆయా సంస్థ‌ల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. కొన్ని సంస్థ‌ల అతి ఉత్స‌హంతో జాతీయ భద్ర‌త‌కు ముప్పువాటిల్లే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని కేంద్రం పేర్కొంది. ఇక నుంచి భ‌ద్ర‌తా బ‌ల‌గాల, ప‌లు సున్నిత‌మైన అంశాల‌పై వార్త‌లు ప్ర‌స‌రించే ముందు త‌గు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని మీడియా సంస్థ‌ల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img