నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 25 వేల మంది ఉపాధ్యాయులు రోడ్డునపడ్డారు. అయితే ఈ తీర్పును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. మరలా రివ్యూ పిటిషన్ వేస్తామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నిరసనకారులను మమతా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం మిడ్నాపోర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా మాట్లాడుతూ.. ‘ ఎవరు నిజాయితీ పరులు, ఎవరు కాదు అనే విషయంలో మీకు ఆందోళన వద్దు. ఉద్యోగం ఉందా.. జీతాలు సరైన సమయానికి పడుతున్నాయా లేదా అనే విషయం గురించే ఆలోచించండి. టీచర్లు నియామాకాల్లో పారదర్శకత సంబంధించి జాబితాను ప్రభుత్వం. కోర్టులు పరిశీలిస్తాయి,. మీ ఉద్యోగాలకు నేను గ్యారంటీ. తిరిగి స్కూళ్లకు వెళ్లి మీ విధులు నిర్వర్తించండి. ఈ విషయం గురించి గత రాత్రి నుంచి చాలాసార్లే మాట్లాడాను. నేను మీతో ఉన్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారి తరఫున రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని, అప్పటివరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని మమత విజ్ఞప్తి చేశారు.
మీ ఉద్యోగాలకు నేను గ్యారెంటీ : మమతా బెనర్జీ
- Advertisement -
RELATED ARTICLES