Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్మేడేను ఘనంగా నిర్వహించాలి

మేడేను ఘనంగా నిర్వహించాలి

– మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి
– సిఐటియు చండూరు మండలం కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ
నవతెలంగాణ- చండూరు  :
 మే1న ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చండూరు పట్టణ  కేంద్రంలో,గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కట్టు బానిసలుగా మార్చేందుకు పెద్ద కుట్ర చేస్తున్నాదని ఆయన  విమర్శించారు.బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.  కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి . హక్కులను పోరాడి సాధించుకున్న   మేడే అమరవీరుల స్ఫూర్తితో వారు సాధించిన హక్కులపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెహ్రు బ్రిటిష్ పాలనలో కూడా దేశంలో అమలు చేసిన చట్టాలను బిజెపి ప్రభుత్వం వ్యతిరేకించడం దారుణం అని మండిపడ్డారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని అన్నారు.ఈ ప్రైవేటీకరణతో సామాజిక న్యాయం దెబ్బతింటుందని రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ధరలు ఆకాశాన్ని  అంటుతుంటే మళ్లీ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 11ఏళ్ల బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల మధ్యన కుల మతాల పేరుతో విభజన సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతుందని అన్నారు.మోడీ విధానాలపై కార్మిక వర్గం ప్రతిఘటనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె అని అన్నారు.145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఈ దేశభక్తియుత సమ్మెలోకార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, మే 1న చండూరు మండల కేంద్రంలో జరిగే  మే డే దినోత్సవం కు  గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్,వివో ఏ లు, వాటర్ మెన్ లు, అందరూ తప్పకుండా హాజరుకావాలని ఆయన కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం,చిట్టిమల్ల లింగయ్య,హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయం కృష్ణయ్య, రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, సైదులు, జాని, నగేష్, చిరంజీవి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img