నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో టీఎంసీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో మైనార్టీ పెద్దలను ఇవాళ చర్చలకు ఆహ్వనించింది. ఈ సమావేశాలకు ఆయా ముస్లింల పెద్దలు హాజరకానున్నారు. కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లు మైనార్టీ వర్గాలకు ఆమోదయోగ్యంలేదని, బలవంతంగా వక్ప్ బిల్లును దేశంలో అమలు చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని ముస్లింలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వక్ప్ బోర్టు ఆస్తులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోందని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని వెల్లడించాయి.
మైనార్టీ సంఘాలతో సీఎం మమత కీలక భేటీ
- Advertisement -
RELATED ARTICLES