Thursday, May 1, 2025
Homeజాతీయంమోడీపై షర్మిల తీవ్ర విమర్శలు..

మోడీపై షర్మిల తీవ్ర విమర్శలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని మోడీపై ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, అమరావతి మట్టిని ప్రధానికి బహుమతిగా పంపుతున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ, ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా? లేక మళ్లీ మట్టి మాత్రమేనా?” అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి, గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img