నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో పాక్, భారత్ మధ్య ఉత్రక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దీంతో ఏ క్షణంలో ఏమైంతోదో తెలియక జమ్మూకశ్మీర్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయాందోళనకు గురైవుతున్నారు. ఇటీవల సరిహద్దు గ్రామస్తులు పలు బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే..బంకర్లలోకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకోవచ్చు అని తగు ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా ముందస్తు పంట కోతలకు జమ్మూకశ్మీర్ ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటలు యుద్ధ పాలుకాకుండా..పలు గ్రామాల్లో పంట కోతలు మొదలుపెట్టారు. పాక్ దేశానికి అతి సమీపంగా ఉన్న పలు గ్రామాలు..ఈ ముందస్తు పంటల కోతలకు శ్రీకారం చుట్టాయి. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్దం మొదలైతే..ముందుగా నష్టపోయింది తామేనని ఆయా సరిహద్దు గ్రామ ప్రజలు వాపోతున్నారు. యుద్ధ కాలంలో ఆహారానికి కొరత ఏర్పడ్డకుండా..సరిపడ నిత్యవసర వస్తువులను కూడా నిల్వ చేసుకుంటున్నామని, పశువులను, ఎండ్ల బండ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని బార్డర్ ప్రజలు తెలిపారు.
యుద్ధ భీతితో..జమ్మూలో ముందస్తు పంట కోతలు
- Advertisement -
RELATED ARTICLES