నవతెలంగాణ-హైదరాబాద్: ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించాలని కోరుతూ మొఘల్ వారసుడు ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. సమాధి వద్ద భద్రతను పెంచాలని కోరుతూ యాకూబ్ హబీబుద్దిన్ తన లేఖలో కోరారు. సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని శాంభాజీ నగర్ జిల్లాలో.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దిన్.. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు లేఖ రాశారు. ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో యూఎన్‌ను కోరారు. ఔరంగజేబు సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని డిమాండ్ చేశారు. తొవ్వడం, కూల్చడం, మార్పులు కూడా చేయరాదు అన్నారు. సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూర్టీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబ్ తన లేఖలో డిమాండ్ చేశారు.
యూఎన్‌కు మొగల్ వారసుడు లేఖ..
- Advertisement -
RELATED ARTICLES