నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ పోర్స్ కీలక సన్నాహాలు మొదలు పెట్టింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్సప్రెస్ ను నిర్మించారు. దీనిపై శుక్రవారం యుద్ధవిమానాలు టేకాఫ్, ల్యాండింగ్‌ను సాధన చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్ రహదారి రన్‌వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్‌ప్రెస్‌వే ఇది. గతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బూందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ సౌకర్యాలున్నాయి.
- Advertisement -