చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ పాన్ ఇండియా చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ను రిలీజ్ చేశారు. ఇది హనుమంతునికి శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తిని అందంగా చూపించే ఘన నివాళి. ఈ పాట సోల్ ఫుల్ ఫీమేల్ వాయిస్‌తో ప్రారంభమవుతుంది. చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్ ‘జై శ్రీ రామ్’ అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు, సీతా కళ్యాణం వేడుకల నేపథ్యంలో సాగే ఈ సాంగ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంది. హృదయాన్ని హత్తుకునే క్షణంలో హీరో పవిత్ర ఉత్సవానికి శ్రీ హనుమంతునిని ఆహ్వానిస్తాడు. ఈ పాటలో భావోద్వేగం, భక్తిశ్రద్ధను మరింతగా పెంచుతుంది. మొత్తం పాట ఓ గ్రాండ్ సెటప్‌లో చిత్రీకరిం చారు. ఇది ఆధ్యాత్మిక సంప్రదాయాల సారాన్ని అద్భుతంగా చూపించింది. ఆధ్యాత్మిక, దైవిక శక్తితో నిండిన అద్భుతమైన సాంగ్‌గా ఎం.ఎం. కీరవాణి కంపోజ్ చేశారు. శంకర్ మహాదేవన్, లిప్సిక ఈ ట్రాక్‌కు తమ ఎనర్జిటిక్ వోకల్స్ అందించారు. భక్తి, సాంస్కృతిక గొప్పతనాన్ని లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కవితాత్మకంగా అందించారు. చిరంజీవి చరిస్మాటిక్ ప్రజెన్స్‌తో అదరగొట్టారు. గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. హనుమంతుడిగా అలంకరించబడిన పిల్లల ప్రజెన్స్ భక్తిని జోడిస్తుంది. హనుమాన్ జయంతికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. ఈ సాంగ్‌తో శుభారంభం చేయటాన్ని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. త్రిష కష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు.
‘రామ రామ..’తో శుభారంభం
- Advertisement -
RELATED ARTICLES