నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాయత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ భవనంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఛాంబర్స్ లోని ఫర్నీచర్, సంబంధిత ఫైల్స్, తదితర సామాగ్రి విద్యుత్ షాక్ తో పూర్తిగా దగ్ధమై భారీగా నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన మున్సిపల్ ఛాంబర్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు భవనాన్ని సందర్శించి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చైర్మన్లు సొంతం నిధులతో నిర్మించుకున్న భవనం పురపాలికలో విప్లమాత్మక మార్పునకు వేదిక అయిందన్నారు. సమర్థవంతమైన పాలన అవగాహన చైర్ పర్సన్ల సమస్యలు మెరుగైన పురపాలికకు సంబంధించి అనేక అంశాలకు దిక్సూచిగా నిలవడమే కాకుండా పూర్తిస్థాయిలో పురపాలక సంఘాలు పటిష్టవంతం చేయడంలో పలు సమస్యలు పరిష్కరించడంలో కూడా సమర్థంగా పనిచేసిందని వివరించారు. ఎంతో చారిత్రత్మక మైనటువంటి ఈ ఛాంబర్ లో విద్యుత్ షాక్ సంభవించడం బాదేసిందని, ప్రభుత్వం ఈ భవనానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటి రూపాయలను మంజూరు చేసి పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని ఆయన కోరారు.
రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ భవనంలో విద్యుత్ ఘాతం
- Advertisement -
RELATED ARTICLES