No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఅంతర్జాతీయం1 బిలియన్‌ డాలర్ల నిధులపై పాక్‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి: IMF

1 బిలియన్‌ డాలర్ల నిధులపై పాక్‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి: IMF

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్థాన్‌కు 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిధులను మంజూరు చేయడానికి ఐఎంఎఫ్ పాక్‌కు పలు షరతులు విధించింది. గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వము ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. అలాగే ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకరావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా IMF కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరినాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాల లోపు వయస్సున్న వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad