నవతెలంగాణ-హైదరాబాద్: లండన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
నవతెలంగాణ-హైదరాబాద్: లండన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ దాదాపు 500మంది ప్రవాస భారతీయులు నిరసన తెలిపారు. పాకిస్థాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని ఉగ్రవాదం నశించాలని పేర్కొన్నారు. అందరూ ఏకమై పాకిస్తాన్ ను భూస్థాపితం చేయాలంటూ… నినాదిస్తున్నారు. అమాయకులను బలితీసుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధితులకు తగిన న్యాయం జరగాలని నినదించారు. దీంతో ఎంబీసీ కార్యాలయ సిబ్బంది ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పహాల్గామ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మంది యాత్రికులను అన్యాయంగా చంపేశారు. ఆతర్వాత పాకిస్థాన్ దేశంపై భారత్ దౌత్యపరంగా పలు ఆంక్షలు విధించింది.
లండన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
- Advertisement -
RELATED ARTICLES