నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అవారి సత్యం మాట్లాడుతూ గ్రామానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ అందించినట్లు వివరించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవాలన్నారు. నిర్మాణం పనులను బట్టి ప్రభుత్వం నిధులు అందజేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవ్వడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇల్లు మంజూరు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, నాయకులు బోనగిరి లక్ష్మణ్, మారుపాక నరేష్, చిలుకూరి నవీన్, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES