- Advertisement -
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 24,100 పైన ట్రేడింగ్ మొదలుపెట్టింది.